Pootha Vesina Letha Maavini Chusinattundi (Telugu Song)

Published: Dec. 2, 2020, 6:49 p.m.

This is a very small impromptu recording of my favorite song, beautifully penned by the Lyricist Ananth Sriram garu and Music composed by MM Keeravani garu. Sung by MM Keeravani sir and Pranavi for the film Sangamam. 

 This song is available in YouTube but is not available on online music platforms, i just want to bring out this beautiful song to your knowledge. 

Here, I have sung my favorite lines from one Charanam and Pallavi. Hope you like it.. and please ignore my mistakes:) (P.S: I have not learnt music and I only sing my heart out when I feel like singing.) 

The complete Lyric goes like this: 

పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నువు నవ్వుతుంటే 

పాత పాటలు కోకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే 

మాటలే వరదలై ఉరకలేస్తున్నవి చెంత నువ్వుంటే… ఉంటే 

పూత వేసిన లేత మావిని చూసినట్టుంది 

మునుపు కలుగని మురిపెమేదో ముద్దుగా నా ముందరుంది 

అలుపు తెలియని వలపు నాలో హద్దులే చెరిపేయమంది 

లేనిదేది నాకు లేదను తలపు ఉండేది 

ఇంతలో నీ పరిచయం ఒక లోటు తెలిపింది 

నువ్వే కావాలని…కలవాలని… కలగాలని 

ప్రియా నా ప్రాణమే మారాము చేసింది.. 

పూత పూసిన పసిడి బొమ్మే కదిలినట్టుంది 

నువు నడిచి వస్తుంటే 

కోత కోసిన కుండే నాలో మిగిలి ఉంటుంది 

నువు విడిచి వెళుతుంటే 

మాటలే మౌనమై ఉసురు తీస్తున్నవి ఒంటరై ఉంటే.. 

కుదురు దొరకని ఎదురుచూపే కొంటెగా వెంటాడమంది. 

నిదుర కుదరని కంటిపాపే వెంటనే నిను చూడమంది 

ఏమిటో నా తీరు నాకే కొత్తగా ఉంది 

ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉంది 

నిరీక్షణ చాలని ఇక చాలని అడగాలని చెలీ..నా ఊపిరే నిను చేరుకొంటుంది 

అంటూ చేతికందని చందమామే అందినట్టుంది 

నువు తాకుతూ ఉంటే 

చోటు ఇమ్మని చుక్కలేవో అడిగినట్టుంది 

నను తోడు రమ్మంటే 

మాటలే కవితలై మురిసిపోనున్నవి జంట నువ్వైతే… అయితే… 

******* 

Voice: Padmavathy  

Follow TheTeluguLogili on Instagram - https://www.instagram.com/thetelugulgili , or Telugu Logili on Anchor/Spotify/Apple Podcasts/Google Podcasts/Radio Public/Overcast 

************** 

Disclaimer: I do not own the copy rights of this Song content and Music. Copy rights are owned by respective owners.

--- Send in a voice message: https://anchor.fm/telugulogili/message Support this podcast: https://anchor.fm/telugulogili/support